Friday, December 20, 2024

‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థిగా నితీశ్ కుమార్

- Advertisement -
- Advertisement -

బల్లియా ( యూపీ) : బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల ప్రజలు ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా నితీశ్ కుమార్‌ను కోరుకుంటున్నారని బీహార్ మంత్రి , జెడి(యు) నేత శర్వణ్‌కుమార్ శనివారం వెల్లడించారు. అయితే ప్రధాని అభ్యర్థిగా , లేదా మిత్ర పక్షాల కోఆర్డినేటర్‌గా ఉండాలని నితీశ్ కుమార్ ఆశించడం లేదని మంత్రి శర్వణ్‌కుమార్ పేర్కొన్నారు. ఇండియా కూటమి మూడో సమావేశం ఈనెల 31, సెప్టెంబర్ 1న ముంబైలో జరగనున్న నేపథ్యంలో బీహార్ మంత్రి వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి.

నితీశ్ కుమార్ ప్రధాని అభ్యర్థిగా ముందుకు వస్తారా అని ప్రశ్నించగా, ప్రధాని పదవికి సమర్థులైన అభ్యర్థి నితీశ్ కుమార్ అని శర్వణ్‌కుమార్ సమర్థించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని ఫుల్‌పూర్ నుంచి నితీశ్ పోటీచేయాలన్న డిమాండ్ పై మాట్లాడుతూ నితీశ్ కుమార్ అలాంటి కోరికేదీ వెల్లడించలేదని, పార్టీ కూడా ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేదని శర్వణ్ కుమార

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News