- Advertisement -
బెంగళూరు : చంద్రయాన్ 3 ప్రయెగానికి సంబంధించి ఇస్రో శనివారం రాత్రి తాజా ప్రకటన వెలువరించింది. ఎంచుకున్న మూడు నిర్ణీత లక్షాలలో రెండింటిని ఈ మిషన్‌లో ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. మొదటి కీలక లక్షం చంద్రుడి ఉపరితలంపై వ్యోమనౌక సాఫ్ట్ ల్యాండింగ్. ఇక రెండో లక్షంలో ల్యాండర్ విక్రమ్ నుంచి సజావుగా రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడి ఉపరితలంపైకి రావడం. ఇది కూడా సక్రమంగా జరిగింది. ఇక మిగిలింది సాగుతున్నదీ చంద్రుడిపై శాస్త్రీయ పరిశోధనలు సాగించడం, అన్ని పేలోడ్స్ సక్రమంగా పనిచేస్తూ ఉండటంతో ఈ మూడో లక్షం కూడా విజయవంతం అవుతుందని విశ్వసిస్తున్నట్లు ఇస్రో తెలిపింది.
- Advertisement -