నిజామాబాద్: ప్రేమించిన యువకుడు మోసం చేయడంలో లైంగికంగా వేధిస్తుండడంతో పదో తరగతి బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పదో తరగతి చదువుతున్న ఓ బాలిక, మైనర్ బాలుడిని ప్రేమించింది. ప్రేమించిన తరువాత బాలుడి అసలు రూపం బయటపడింది. ప్రేమ పేరుతో ఆమెను లైంగికంగా వేధించాడు. అతడు వేధింపులు తట్టుకోలేక చావే శరణ్యమని అనుకోని లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. కూరగాయలు తీసుకరమ్మని బాలికకు తల్లి చెప్పింది. కండ్లకలక రావడంతో తాను బయటకు వెళ్లనని తల్లికి చెప్పింది. దీంతో తల్లి కూరగాయలు తీసుకొస్తానని వెళ్లడంతో బాలిక ఒంటరిగా ఇంట్లోనే ఉంది.
తల్లి బయటకు వెళ్లగానే బాలిక ఉరేసుకుంది. తల్లి ఇంటికి వచ్చేసరికి కూతురు దూలానికి వేలాడుతుండడంతో వెంటనే కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న దగ్గర సూసైడ్ నోట్ లభించింది. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకో అన్నయ్య అని చెప్పింది. తనని క్షమించాలని ప్రేమ పేరుతో మోసపోయానని, తనని ఒకరు వేధిస్తున్నారని, తను చాలిస్తున్నానని తన జీవితం ముగిసిందని, మిమ్మల్ని మిస్ అవుతున్నా అంటూ లేఖ రాయడంతో తనని వేధించిన వ్యక్తి పోన్ నంబర్‌ను లేఖలో రాసింది. ప్రేమించిన యువకుడు మైనర్‌గా ఉన్నారు. పోలీసులు కేస నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.