Saturday, December 21, 2024

సిద్ధిపేటలో ఏకగ్రీవ తీర్మానాలు..

- Advertisement -
- Advertisement -

సిద్దిపేటలో ఎన్నిక ఏదైనా ఏకగ్రీవం అని మరో సారి సిద్దిపేట ప్రజలు నిరూపించారు. ఆదివారం రోజున మంత్రి హరీష్ రావుకు ఏకగ్రీవ తీర్మానాలు అందజేశారు. ఒక వైపు గ్రామాలు మరో వైపు పలు గ్రామాల్లో కుల సంఘాలు ఏకతాటి పైకి వచ్చి మంత్రి హరీష్ రావుకు, బిఆర్ఎస్ పార్టీకె జై కొడుతున్నారు. నేడు సిద్దిపేట రూరల్ మండలంలోని చిన్న గుండవెళ్లి గ్రామ మత్స్య కారుల సహకార సంఘం ముదిరాజ్, ఇరుకోడ్ గ్రామ హనుమంతుపల్లి ముదిరాజ్ సంఘం, సిద్దిపేట పట్టణంలోని హనుమాన్ నగర్ ముదిరాజ్ సంఘం మొత్తం మంత్రి హరీష్ రావుకు జై కొట్టారు.

గ్రామాల అభివృద్ధి చేస్తూ.. మా కుల సంఘాలకు నిధులు ఇచ్చిన మంత్రి హరీష్ రావు వైపే అంటూ నినదించారు. ఇలా నియోజకవర్గంలో ఏకగ్రీవ తీర్మానాల పర్వం సిద్దిపేటలో మరోసారి మొదలైంది. ఈ సందర్భంగా సిద్దిపేట ప్రజల ఆదరణ, ఆప్యాయత గుండెల్లో పెట్టుకుంట అని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఏకతాటి పైకి వచ్చి ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడం పట్ల అభివృద్ధి, బిఆర్ఎస్ పార్టీపై నమ్మకానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News