Saturday, December 21, 2024

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం 24 పరగణ జిల్లా దత్తాపుకూర్‌లోని బరేలీ గ్రామంలో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. క్షతగాత్రులను బరసాత్ ఆస్పత్రికి తరలించారు. కోల్‌కతాకు ఉత్తర వైపున 30 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. బాణాసంచా ఫ్యాక్టరీ పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాణాసంచా ఫ్యాక్టరీ యజమాన్యం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.

Also Read: మైలార్ దేవుపల్లిలో యువకుడు దారుణ హత్య..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News