Friday, December 20, 2024

కారుతో డాక్టర్ ను ఢీకొట్టి… బానెట్‌పై 50 మీటర్లు లాక్కెళ్లి (వీడియో వైరల్ )

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్: కారుతో ఢీకొట్టి వైద్యుడిని బానెట్‌పై 50 మీటర్ల దూరం తీసుకెళ్లిన సంఘటన హర్యానా రాష్ట్రం పంచకులలోని సెక్టర్ 8లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సెక్టర్4లోని మానస దేవి కాంప్లెక్స్‌లో వైద్యుడు గగన్ గార్గ్ నివసిస్తున్నారు. పంచకులలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి అతడు విధులు నిర్వహిస్తున్నాడు. స్కూల్ నుంచి తన కుమారుడిని ఇంటికి వైద్యుడు తీసుకొస్తుండగా అతడి కారును మరో కారు వెనక నుంచి ఢీకొట్టింది. వెంటనే వైద్యుడు కారు ఎందుకు ఢీకొట్టావని ప్రశ్నించడంతో అతడిని చంపుతానని డ్రైవర్ బెదిరించాడు. కారు ఎదురుగా నిలబడడంతో అతడి పైకి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన వైద్యుడు కారు బానెట్ పట్టుకోవడంతో 50 మీటర్ల దూరం వెళ్లిన తరువాత సిగ్నల్ పడడంతో కారును ఆపాడు. తీవ్రంగా గాయపడిన వైద్యుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు నడిపిన డ్రైవర్‌ను కర్‌మాలిక్‌గా గుర్తించి వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News