Saturday, December 21, 2024

రహస్య పత్రాల లీక్ కేసు.. జైల్లోనే ఇమ్రాన్‌ఖాన్ విచారణ

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : అధికారిక రహస్యాల చట్టం పరిధిలో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను దర్యాప్తు సంస్థ (ఎఫ్‌ఐఎ) విచారించింది. అవినీతి కేసుకు సంబంధించి ఇమ్రాన్‌ఖాన్ మూడేళ్ల జైలు శిక్షకు గురై, ఇప్పుడు అట్టాక్ జైలులో ఉన్నారు. దర్యాప్తు సంస్థకు చందిన ఉగ్రవాద నిరోధక విభాగం (సిటిడబ్లు) ఇమ్రాన్‌ఖాన్‌ను పలు విషయాలపై ప్రశ్నించిందని ఆదివారం మీడియా వార్తలు వెలువడ్డాయి. అధికారిక సమాచారాన్ని తప్పుడు పనులకు వాడుకున్నట్లు ఇమ్రాన్‌ఖాన్‌పై అభియోగాలు ఉన్నాయి.

రహస్య దౌత్య సమాచారాన్ని తాను అక్రమంగా చేరవేసినట్లు విచారణ క్రమంలో ఇమ్రాన్‌ఖాన్ అంగీకరించినట్లు వార్తలు వెలువడ్డాయి. తోషాఖానా కేసుకు సంబంధించి ఈ నెల ఆరంభంలోనే ఇమ్రాన్ అరెస్టు అయ్యారు. జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తనను ప్రధానిగా తొలిగించేందుకు అమెరికా మద్దతుతో సైన్యం కుట్ర పన్నుతోందనే సమాచార పత్రాలే ఇమ్రాన్‌ఖాన్ ద్వారా బయటకు లీక్ అయినట్లు అభియోగాలు వెలువడ్డాయి. ఎఫ్‌ఐఎకు చెందిన ఆరుగురు సభ్యుల సంయుక్త దర్యాప్తు బృందం అట్టాక్ జైలకు సంస్థ డిప్యూటీ డైరెక్టర్ అయాజ్ ఖాన్ ఆధ్వర్యంలో వెళ్లి, మాజీ ప్రధానిని విచారించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News