Monday, January 6, 2025

కాకినాడ టౌన్ – లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాకినాడ టౌన్ – లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఆయా రైళ్లు సెప్టెంబర్ ఒకటి నుంచి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కాకినాడ టౌన్ – లింగంపల్లి (రైలు నం.07439) సెప్టెంబర్ 01వ తేదీ 14వ తేదీ వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైలు కాకినాడలో రాత్రి 8.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని దక్షిణమధ్య రైల్వే పేర్కొంది. అలాగే లింగంపల్లి – కాకినాడ (07440) రైలు సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో అందుబాటులో ఉం టుందని అధికారులు తెలిపారు. ఆయా తేదీల్లో రైలు సాయంత్రం 6.25 గంటలకు లింగంపల్లి స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు గమ్యస్థానానికి చేరుకోనుంది. ఈ రెండు మార్గాల్లో రైలు సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, గుడివాడ జంక్షన్, గుంటూరు జంక్షన్, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లలో ఆగుతాయని, ఆయా రైళ్లలో ఏసి 2 టైర్, 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News