- Advertisement -
షిల్లాంగ్ : మేఘాలయ రాష్ట్రంలో 1700 గుహలను వెలుగు లోకి తెచ్చిన ఆ రాష్ట్రానికి చెందిన బ్రియాన్ డి ఖర్పరాన్‌ను ఆయన బృందాన్ని ప్రధాని మోడీ ప్రశంసించారు. మన్‌కీబాత్ ప్రసంగంలో ప్రధాని ప్రత్యేకంగా బ్రియాన్ డి ఖర్పరాన్ సేవలను కొనియాడారు. 1964లో బ్రియాన్ స్కూలు విద్యార్థిగా మొట్టమొదటిసారి గుహలను కనుగొనడం ప్రారంభించారని, 1990లో ఆయన తన స్నేహితునితో కలిసి అసోసియేషన్ నెలకొల్పారని, దీని ద్వారా రాష్ట్రంలో ఎవరికీ తెలియన్ గుహలను కనుగొనగలిగారని ప్రధాని మోడీ వివరించారు. మేఘాలయలో ఉండే గుహలను సందర్శించడానికి ప్రయత్నించాలని దేశ ప్రజలకు మోడీ విజ్ఞప్తి చేశారు. మేఘాలయ అడ్వెంచరర్స్ అసోసియేషన్ సంస్థాపక కార్యదర్శి ఖర్పరాన్ ఇంతవరకు మేఘాలయ రాష్ట్రంలో 537.6 కిమీ పరిధిలోని గుహలను మ్యాప్ చేయగలిగారు
- Advertisement -