ఢిల్లీ: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ స్మారక నాణెంను రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ సోమవారం విడుదల చేయనున్నారు. ఎన్‌టిఆర్ శతజయంతి సదర్భంగా రూ.100 స్మారక నాణెం ముద్రణ చేశారు. రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నాణెం ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ చేతుల మీదుగా నాణెం విడుదల చేయనున్నారు. హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లో ఎన్‌టిఆర్ స్మారక నాణెం తయారు చేశారు. ఈ కార్యక్రమానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బిజెపి ఎపి అధ్యక్షురాలు పురందేశ్వరి పాల్గొననున్నారు. నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి ఎన్‌టిఆర్ కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్‌టిఆర్‌తో పని చేసిన సన్నిహితులకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌టిఆర్ జీవిత విశేషాలతో 20 నిమిషాల వీడియో ప్రదర్శన ఉంటుంది.
Also Read: చంద్రుడిపై హాట్‌పోట్లు