- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : నకిలీ మందుల క్రయ విక్రయాల కార్యకలాపాలకు సంబంధించిన ఫిర్యాదులు ఇవ్వడంతో పాటు సమాచారం అందజేసేందుకు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డిసిఎ) విభాగం టోల్ ఫ్రీ నెంబర్ (1800 599 -6969)ను ఏర్పాటు చేసింది. తెలంగాణలో ఔషధాల నాణ్యత, ధర, లభ్యత, తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన సమాచారాన్ని ఈ టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి అందజేయవచ్చని డిసిఎ డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్ రెడ్డి తెలిపారు. ఈ టోల్ ఫ్రీ నంబర్ అన్ని పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమాచారం అందజేసిన వారి వివరాలకు గోప్యంగా ఉంచుతామని అన్నారు.
- Advertisement -