- Advertisement -
న్యూఢిల్లీ : రాష్ట్రపతిభవన్ సాంస్కృతిక కేంద్రంలో ఎన్‌టిఆర్ నాణేం ఆవిష్కరణ కార్యక్రమం తరువాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూతో కలిసి చంద్రబాబు నాయుడు, ఎన్‌టిఆర్ కుటుంబ సభ్యులు గ్రూప్ ఫోటో దిగారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్‌టిఆర్ హాజరుకాలేదు. ఎన్‌టిఆర్ నాణేంపై ఓ వైపు ఆయన ముఖచిత్రం మరో వైపు వందరూపాయల చలామణి విలువను తెలిపే సంఖ్య పొందుపర్చారు. విడుదల కార్యక్రమం దశలోనే బిజెపి నేత నడ్డాతో చాలా సేపు చంద్రబాబునాయుడు ఏదో మాట్లాడారు. ఎంపి బిజెపి అధ్యక్షురాలు అయిన పురంధేశ్వరి ఈ పరిణామంపై అసహనంతో కన్పించారు. ఎన్‌టిఆర్ నాణేం విడుదల కార్యక్రమానికి తనను పిలవకపోవడం దారుణమని లక్ష్మిపార్వతి విజయవాడలో విమర్శించారు. పురంధేశ్వరి విలన్ అయ్యారని వ్యాఖ్యానించారు.
- Advertisement -