Monday, December 23, 2024

తోషాఖానా కేసులో శిక్షను సవాలు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ వ్యాజ్యం

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : తోషాఖానా అవినీతి కేసులో విధించిన మూడేళ్ల జైలు శిక్షను రద్దు చేయాలని కోరుతూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై రిజర్వు చేసిన తీర్పును మంగళవారం వెల్లడిస్తామని పాకిస్థాన్ హైకోర్టు సోమవారం ప్రకటించింది. రిజర్వు చేసిన తీర్పు మంగళవారం ఉదయం 11 గంటలకు వెల్లడిస్తామని పేర్కొంది. ఈనెల 22న ప్రారంభమైన ఈ విచారణ, ఎలెక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్థాన్ తరఫున న్యాయవాది హాజరు కాకపోవడంతో శుక్రవారానికి వాయిదా పడింది. ఖాన్ తరఫు న్యాయవాది లతీఫ్ ఖోసా గురువారం తన వాదన పూర్తి చేశారు.

ఇమ్రాన్ ఖాన్‌పై తొందరపాటు, అనేక లోపాలతో శిక్ష విధించారని వాదించారు. అందువల్ల ఆ తీర్పును పక్కన పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అయితే డిఫెన్స్ పక్షం తమ వాదనలు పూర్తి చేయడానికి మరికొంత సమయం కోరింది. ఈలోగా ప్రభుత్వ వ్యవస్థలపైనా, అధికారులపైన వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు చేశారని దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను బెలోచిస్థాన్ హైకోర్టు సోమవారం రద్దు చేసింది. అలాగే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ జారీ చేసిన అరెస్ట్ వారంట్లను కూడా హైకోర్టు రద్దు చేసింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News