Thursday, September 19, 2024

80ఎకరాల్లో ఎకో పార్కు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నగర శివారులోని కొత్వాల్‌గూడలో 80 ఎకరాల విస్తీర్ణంలో హెచ్‌ఎండిఏ ఏర్పాటు చేయనున్న ఎకో పార్కులో దేశంలోనే అతి పెద్ద ఆక్వా మెరైన్ పార్క్‌ను 4.27 ఎకరాల్లో హెచ్‌ఎండిఏ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే రహదారుల నిర్మాణ పనులతో పాటు బర్డ్ ఏవియరీ (పక్షుల కోసం ఏర్పాటు చేసింది), గ్రీనరీ పార్కులతో పాటు వాకింగ్ బోర్డు ట్రాక్ పనులు ఇప్పటికే ఈ పార్కులో ప్రారంభమయ్యాయి. అయితే మిగ తా పనులను కూడా త్వరితగతిన ప్రారంభించాల ని హెచ్‌ఎండిఏ అధికారులు భావిస్తున్నారు. హి మాయత్‌సాగర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డును అనుకొని నిర్మిస్తున్న ఈ పార్కు ప్రధాన ద్వారం వరకు అనుసంధాన రహదారి, పార్కింగ్ ప్రదేశం కోసం హెచ్‌ఎండిఎ అధికారులు ప్రత్యేకంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సుమారు రూ.1.95 కోట్ల వ్య యంతో ఈ పనులను చేపట్టేందుకు ఇటీవల టెం డర్లు పిలిచారు. దేశంలోని అతి పెద్ద ఆక్వేరియం, పక్షిశాలలను పార్కులో ఏర్పాటు చేస్తుండటంతో దానికి అనుగుణంగా రోడ్లు, పార్కింగ్ వసతులను కల్పిస్తున్నారు. ఔటర్ సర్వీస్ రోడ్డు నుంచి పార్కులోకి వెళ్లే ప్రవేశ ద్వారం వరకు విశాలమైన రోడ్డు ను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఈ రెండు పనులను చేప్టందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లను పిలిచారు.

ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మాణాలు
రాజేంద్రనగర్ ఓఆర్‌ఆర్ ఇంటర్‌ఛేంజ్ సమీపంలోని హిమాయత్‌సాగర్ జలాశయాన్ని ఆనుకొని ఉన్న కొత్వాల్‌గూడ రెవెన్యూ పరిధిలోని 80 ఎకరాల ప్రభుత్వ స్థలంలో హెచ్‌ఎండీఏ ప్రతిష్టాత్మకంగా ఎకో హిల్ పార్కు పనులను చేపట్టాలని నిర్ణయించింది.ఇందులో భాగంగా నగరవాసులకు వి నోదం, విజ్ఞానం అందించే వివిధ రకాల థీమ్‌లతో పాటు దేశంలోనే అతిపెద్ద అక్వేరియాన్ని ఇక్కడ హెచ్‌ఎండిఎ నిర్మించనుంది. ఈ మేరకు అంతర్జాతీయ సంస్థల నుంచి బిడ్లను సైతం హెచ్‌ఎండిఏ పిలిచింది. అయితే ఈ బిడ్లను త్వరలోనే ఓకే చేసి పూర్తిస్థాయిలో పనులను చేపట్టాలని హెచ్‌ఎండిఏ అధికారులు భావిస్తున్నారు.హిమాయత్‌సాగర్ జ లాశయాన్ని వీక్షించేందుకు వచ్చే పరిసర ప్రాం తాల ప్రజలకు ఈ హిల్ పార్కు మంచి సేదనిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పార్కును అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల మేరకు నిర్మిస్తున్నారు. అందులో భాగంగా డిజైన్, బిల్ ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లను (డిబిఎఫ్‌ఓటీ) విధానంలో చేపడతున్నామని హెచ్‌ఎండిఏ అధికారులు తెలిపారు. ఈ పార్కు ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.300 కోట్ల వరకు ఉంటుందని, దీనిని (పిపిపి) పద్ధతిలో ప్రైవేటు భాగస్వామ్యంతో కలిసి చేపడుతున్నామని హెచ్‌ఎండిఏ అధికారులు తెలిపారు.

ఈ పార్క్ ప్రత్యేకతలు ఇలా….
దేశంలోనే అతి పెద్ద ఆక్వా మెరైన్ పార్క్ 4.27 ఎకరాల్లో ఏర్పాటు చేయనుండగా, వంపుతో కూడిన టన్నెల్ 100 మీటర్ల పొడవు, 3.5 మీటర్ల వెడల్పు తో కూడిన నడక దారి, 180 డిగ్రీ కోణంలో వీక్షించేలా గ్లాస్ టన్నెల్స్ నిర్మాణం. మంచి వ్యూ పాయిం ట్ రెస్టారెంట్ నిర్మాణం, కాన్ఫరెన్స్ హాల్, లగ్జరీ వుడెన్ కాటేజెస్, డోమ్ థియేటర్, 7డీ థియేటర్, వర్చువల్ అక్వేరియం, టచ్ ట్యాంక్స్, కోయ్ ఫీడిం గ్, పిల్లల కోసం ఇంటరాక్టివ్ కియోసక్స్‌లను నిర్మిస్తున్నారు. ఈ పార్కు నిర్మాణ పనులకు 2022 అక్టోబర్ 11వ తేదీన రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపన చేశారు.
పార్కులో సదుపాయాలు ఇలా….
2.5 కి.మీ పొడవు, 2.4 మీటర్ల వెడల్పుతో బోర్డు వాక్, 6 ఎకరాల్లో బర్డ్ ఏవియరీ, 2.5 కి.మీ పొడ వు, 6 మీటర్ల వెడల్పుతో పాత్‌వేలు, అప్రోచ్ రోడ్డు, ఎంట్రన్స్ వద్ద పార్కింగ్ సదుపాయం, గెజెబోస్, పర్గూలాస్, బట్టర్ ఫ్లై గార్డెన్, సెన్సోరి పార్క్, గ్రీన రీ ల్యాండ్‌స్కేపింగ్, ఇన్ఫినిటీ పూల్, క్యాంపింగ్ టెంట్స్, కాన్ఫరెన్స్ హాల్, లగ్జరీ వుడెన్ కాటేజెస్, ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా భూములను కలుపుతూ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలను చేపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News