Friday, December 20, 2024

సహకార బ్యాంకులో మోసం… 14 ఏళ్ల తరువాత పరారీలో ఉన్న దంపతుల పట్టివేత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలోని ఓ ప్రైవేట్ సహకార బ్యాంకును మోసం చేసిన కేసులో కీలక నిందితులను సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. 14 సంవత్సరాల క్రితం నమోదైన కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి నేరాభియోగపత్రం దాఖలు చేశారు. తాజాగా ఈ స్కాంతో సంబంధం ఉన్న ఓ జంటను పట్టుకున్నారు. కూకట్‌పల్లిలో ఉన్న కన్యకా పరమేశ్వరి సహకార బ్యాంకులో 2009లో అవకతవకలు జరిగాయి. బ్యాంకు డైరెక్టర్లు, ఉద్యోగులు కలిసి మోసానికి పాల్పడ్డారు. బినామీ పేర్ల మీద రుణాలు తీసుకొని డైరెక్టర్లు, ఉద్యోగాలు సొంత ఖాతాలకు మళ్లించుకున్నారు. దీనిపై బ్యాంకు లిక్విడేటర్ అన్నపూర్ణ 2009 అక్టోబర్ 10న ఫిర్యాదు చేయడంతో సిఐడి అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఈ కేసులో రూ.2.86 కోట్ల మోసానికి పాల్పడినట్లు అధికారులు తేల్చారు. పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే 2015లో నేరాభియోగపత్రం దాఖలు చేశారు. అయితే ఈ కేసులో కన్యకా పరమేశ్వరి డైరెక్టర్‌గా ఉన్న పద్మ.. రూప పేరుతో రుణం తీసుకున్నట్లు గుర్తించారు. ఆమెతో పాటు అదే బ్యాంకులో ఉద్యోగిగా పనిచేసిన భర్త కృష్ణవర్మకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. సిఐడి డైరెక్టర్ మహేశ్ భగవత్ పర్యవేక్షణలో ఈ ఇద్దరిని అరెస్ట్ చేసిన అధికారులు రిమాండ్‌కు తరలించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News