Monday, December 23, 2024

‘భగవంత్ కేసరి’ సెట్స్‌లో బాలయ్య వారసుడు

- Advertisement -
- Advertisement -

నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ సినీ అరంగేట్రం కోసం నందమూరి అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. అదిగో, ఇదిగో అని అంటున్నారు కానీ.. ఆయన ఎంట్రీకి సంబంధించి ఇప్పటి వరకు సరైన క్లారిటీ రాలేదు. తాజాగా ‘భగవంత్ కేసరి’ సెట్స్‌లో మోక్షజ్ఞ ఫొటోలు సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ సినిమాలో అతను అతిథి పాత్రలో కనిపించనున్నాడా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

అయితే ఓ సినిమాలో మోక్షజ్ఞ అతిథి పాత్రలో కనిపించనున్నాడంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ సినిమా ‘భగవంత్ కేసరి’నే అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా చేస్తున్న ‘భగవంత్ కేసరి’ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News