- Advertisement -
ముంబై: రానున్న వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియాను ఎంపిక చేయడం తమకు సవాల్ వంటిదేనని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. సొంత గడ్డపై జరిగే మెగా టోర్నమెంట్‌లో జట్టుపై భారీ అంచనాలు ఉన్నాయన్నాడు. ఇక ప్రతి ఆటగాడు జట్టులో చోటు సంపాదించాలని భావిస్తాడనడంలో సందేహం లేదన్నాడు. అయితే జట్టులో స్థానం కోసం విపరీత పోటీ నెలకొన్న ప్రస్తుత తరుణంలో అందరికి జట్టులో స్థానం కల్పించడం సాధ్యం కాదన్నాడు.
ఇదే సమయంలో కొంత మందికి నిరాశ తప్పదన్నాడు. ఇతర జట్లతో పోల్చితే భారత్‌లో పోటీ ఎక్కువ ఉందన్నాడు. ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడమే దీనికి కారణమన్నాడు. ఇలాంటి స్థితిలో మెగా టోర్నీకి జట్టును ఎంపిక చేయడం సెలెక్టర్లకు చాలా క్లిష్టమైన అంశమని రోహిత్ పేర్కొన్నాడు. ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో రోహిత్ ఈ విషయాలు వెల్లడించాడు.
- Advertisement -