Monday, November 18, 2024

బిజెపి టికెట్ ఇవ్వకుంటే రాజకీయాలు వదిలేస్తా: రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బిజెపి టికెట్ ఇవ్వకుంటే రాజకీయాలు వదిలేస్తానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ‘గోషామహల్ బిఆర్‌ఎస్ టికెట్ మజ్లిస్ చేతిలో ఉంది. అందుకే పెండింగ్ పెట్టారు. దారుసలామ్ నుంచి గోషామహల్ బిఆర్‌ఎస్ అభ్యర్థిని ఎంపిక చేస్తారు. నేను రాజకీయాల నుంచి తప్పు కుంటాను కానీ స్వతంత్రంగా, ఇతర పార్టీల నుంచి పోటీ చేయనని స్పష్టం చేశారు. బిజెపి అధిష్టానం నాపై సానుకూలంగా ఉంది. సరైన సమయం చూసి నాపై సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తారేమో?’ అని చెప్పారు.

‘నేను చచ్చినా సెక్యులర్ పార్టీలకు వెళ్లను.. నా ప్రాణం పోయినా బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు పోను.. తెలంగాణను హిందూ రాష్ట్రం చేయాలన్నది నా లక్ష్యం.. బిజెపి నాకు టికెట్ ఇవ్వకుంటే… రాజకీయలు పక్కన పెట్టి నేను హిందూ రాష్ట్రం కోసం పని చేస్తాను’ అని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News