Tuesday, April 1, 2025

వాగ్నెర్ చీఫ్ ప్రిగొజిన్ అంత్యక్రియలకు పుతిన్ వెళ్లడం లేదు

- Advertisement -
- Advertisement -

సెయింట్ పీటర్స్‌బర్గ్ (రష్యా) : విమాన ప్రమాదంలో మరణించిన వాగ్నెర్ చీఫ్ ప్రిగోజిన్ అంత్యక్రియలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరయ్యే ప్రయత్నాలేవీ లేవని క్రెమ్లిన్ మంగళవారం ప్రకటించింది. ప్రిగోజిన్ భౌతిక కాయాన్ని ఎక్కడ ఎప్పుడు సమాధి చేస్తారో క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ పెష్కోవ్ చెప్పడం లేదు. అయితే రష్యా మీడియా మాత్రం ప్రిగోజిన్ స్వంత నగరం సెయింట్ పీటర్స్ బర్గ్‌లో సెరఫిమోస్కొవ్ శ్మశాన వాటికలో మంగళవారం జరగవచ్చని సూచాయగా వెల్లడించింది. ఆ సిమెట్రీ వద్ద మంగళవారం భారీ ఎత్తున మిలిటరీ భద్రత ఏర్పాటైంది. అదే సిమెట్రీలో పుతిన్ తల్లిదండ్రులను కూడా సమాధి చేశారు. మరికొన్ని సిమెట్రీల్లో కూడా పోలీస్ బలగాలను సిద్ధంగా ఉంచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News