Monday, December 23, 2024

చంద్రుడిపై ఆక్సిజన్..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: చంద్రయాన్3 మిషన్‌లో భాగంగా జాబిల్లిపై విజయవంతంగా పయనిస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ అక్కడి ఉపరితలంపై పరిశోధనల్లో మరిన్ని కీలక అంశాలను గుర్తించింది. అందులోని లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్(ఎల్‌ఐబిఎస్) పరికరం చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలం వద్ద సల్ఫ ర్( ఎస్) ఉనికిని స్పష్టంగా గుర్తించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తె లిపారు. దీనితో పాటుగా అల్యూమినియం(ఎఎల్), కాల్షి యం( సిఎ), ఫెర్రమ్( ఎఫ్‌ఇ), క్రోమియం( సిఆర్), టైటానియం(టిఐ),సిలికాన్(ఎస్‌ఐ) మ్యాంగనీస్(ఎంఎన్), ఆక్సిజన్(ఒ) మూలకాలను కూడా ఈ పరికరం గుర్తించినట్లు ఇ స్రో మంగళవారం ఒక ట్వీట్‌లో తెలియజేసింది. హైడ్రోజన్ కోసం అన్వేషణ కొనసాగుతోందని కూడా ఇస్రో తెలిపింది.

దీనికి సంబంధించిన ఒక గ్రాఫ్‌ను కూడా ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో ఉంచింది.ఈగ్రాఫ్‌లో చంద్రుడి ఉపరితలంపై వివిధ లోతులలో గల ఉష్ణోగ్రతల్లో ఉన్న వైవిధ్యాన్ని ఇస్రో వివరించింది. ఆ గ్రాఫ్ ప్రకారం లోతు పెరిగిన కొద్దీ చంద్రుడి ఉష్ణోగ్రత తగ్గుతోంది. చందమామపై మట్టి, ఖనిజాలను పరిశోధించడం కోసం ఈ ఎల్‌ఐబిఎస్ పరికరాన్ని పంపించారు. ఈ పరికరాన్ని బెంగళూరులోని ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్(ఎల్‌ఇఓఎస్) ప్రయోగ శాలలో అభివృద్ధి చేసినట్లు ఇస్రో తెలిపింది.మరో వైపు చంద్రుడి ఉపరితలంపై రోవర్ అన్వేషణకు మరో ఏడు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉండడంతో రోవర్‌ను వీలయినంత ఎక్కువగా చంద్రుడి ఉపరితలంపై తిప్పడానికి ఇస్రో శాస్త్రజ్ఞులు కాలంతో పోటీ పడి కృషి చేస్తున్నారు.

14 రోజుల తర్వాత చంద్రుడిపై రాత్రి మొదలవుతుంది. ఆ సమయంలో చంద్రుడిపై ఉష్ణోగ్రతలు మైనస్ 180నుంచి 250 డిగ్రీలకు పడిపోతుంది. ఆ సమయంలో సైరశక్తితో పని చేసే రోవర్‌లోని పరికరాలు చాలావరకు సుషుప్తావస్థలోకి వెళ్లిపోతాయి. దీంతో ఈ లోగానే రోవర్ కీలకమైన ప్రయోగాలు జ రిపేలా చూడాలని శాస్త్రజ్ఞులు ప్రయత్నిస్తున్నారు. శివశక్తి ల్యాండింగ్ సైట్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని రోవర్ అన్వేషిస్తూనే ఉంటుందని, రోవర్ ఇప్పటివరకు సుమారు 8 మీటర్ల ప్రాంతాన్ని కవర్ చేసిందని ఇస్రో అంచనా వేసింది.కాగా చంద్రుడి దూళి, కంకర వంటి రసాయన కూర్పును పరిశోధించడం రోవర్ ప్రధాన లక్షాల్లో ఒకటి. ఈ పరిశోధన చంద్రుని భూగర్భ శాస్త్రం, వాతావరణం గురించి ఒక అవగాహనకు దోహదపడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News