Friday, December 20, 2024

బైడెన్ కోసం హోటల్ మౌర్యలో గది..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వచ్చే నెల 9వ తేదీనుంచి రెండు రోజలు పాటు ఢిల్లీలో జరిగే జి20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనే అతిథులకోసం అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్‌సిఆర్ పరిధిలో ని దాదాపు 30 స్టార్ హోటళ్లను బుక్ చేశారు. వీటిలో నగరంలోని ఐటిసి మౌర్య, తాజ్ మాన్‌సింగ్, లాజ్ ప్యాలెస్, హోటల్ ఒబెరాయ్, హోటల్ అశోక లాంటి ప్రముఖ హోటళ్లు ఉన్నాయి. కాగా ప్రభుత్వ వర్గాల కథనం ప్రకారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హోటల్ మౌర్యలో బస చేయనున్నారు. ఇక్కడ అన్ని ఫ్లోర్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ కమాండోల అధీనంలోకి వెళ్లనున్నాయి.

హోటల్‌లోని 14వ అవతస్థులో బైడెన్ బప చేసే గది ఉంది. అక్కడికి ప్రత్యేక లిఫ్ట్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ హోటల్‌లోని 400 గదులను అతిథులకోసం బుక్ చేశారు. ఇక హోటల్ షంగ్రీలాలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, క్లారిడ్జెస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ముక్రాన్ ఇంపీరియల్ హోటల్‌లో ఆస్ట్రేలియా ప్రధాని బస చేయనున్నారు. ఒక వేళ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఈ సమావేశానికి తాజ్ ప్యాలెస్‌లో ఆయనకు విడిది ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News