Friday, December 20, 2024

హే కృష్ణా..!

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలపైన పెట్టుకున్న అంచనాల తలకిందులయ్యాయి. ఖరీఫ్ పం టల సాగుపైన రైతులు పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నా యి. వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు గడిచిపోతుంది. మరో 24గంటలు గడిస్తే ఈ సీజన్‌ల ఆగస్ట్ నెల కూడా ఆడియాశలు చేసి ముగియబోతోంది. తెలుగు రా ష్ట్రాలకు జీవనాడిలా వున్న కృష్ణానది పరివాహకం వర్షభావ దుర్బిక్షంతో వెలవెలబోతోంది. ఆదను దాటిపోతు న్నా లక్షలాది ఎకరాల ఆయకట్టులో ఇంకా వరినాట్లు పడనేలేదు. కృష్టానదిలో వరద ప్రవాహం అడుగంటింది. నదిలో నీటి మడుగులు తప్ప మరెక్కడా నీటి కదలికలేదు. గత రెండు వారాలుగా ఇదే పరిస్థితి నెలకొంది.ఎగువ నుంచి వస్తున్న కొద్దిపాటి నీటి ఊట కూడా ఆగిపోయింది. క్యాచ్‌మెంట్ ఏరియాలో పరిస్థితి ఆందోళన కరంగా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణానదీ ప్రాజెక్టుల కింద ఆయకట్టు ప్రాంతాలలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ వర్షాకాలంలో ఎగువ నుంచి శ్రీ శైలం ప్రాజెక్టు వరకూ వచ్చిన నీటి ప్రవాహం బొటాబొటిగా వంద టిఎంసీల మార్కు వద్దనే ఆగిపోయింది. ఇక ఎగువ నుంచి వరద నీరు వస్తుందన్న ఆశలు కూడా అడుగంటుతున్నాయి. మంగళవారం కృష్ణానదిలో నీటి ప్రవాహాలు, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు నీటి చేరికలు , రిజర్వాయర్లలో ఉన్న నీటినిలువలు పరిశీలిస్తే ఈ ఖరీఫ్ సీజన్ పరిస్థితి ఆందోళన గొలుపుతోంది. ఈ నీటి సవంత్సరం ప్రారంభమయ్యాక జూన్ నుంచి ఇప్పటివరకూ ఎగువన కర్ణాటకలో ఆల్మట్టి ప్రాజెక్టులోకి 204టిఎంసీల నీరు చేరుకుంది. ఆల్మట్టి రిజర్వాయర్‌లో గరిష్ట నీటినిలువ సామర్ధం 129టిఎంసీలు కాగా, గరిష్ట స్థాయికి మించి 75టిఎంసీలకు పైగానే నీరు చేరుకుంది. దిగువన నారాయణ పూర్ ప్రాజెక్టులో కూడా గరిష్ట స్థా యి నీటినిలువ సామర్ధం 37టిఎంసీలుకాగా, ఈ ప్రాజెక్టులోకి వంద టీఎంసీల నీరు చేరింది. ప్రస్తుతం అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు గరిష్ట స్థాయి నీటినిలువలతో నిండు కుండలను తలపిస్తున్నాయి. అదే తెలుగు రాష్ట్రా ల్లో మాత్రం కృష్ణానది ప్రాజెక్టుల పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ జూరాల ప్రాజెక్టులోకి 103టిఎంసీల నీరు చేరింది. ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టు అవసరాలకు విడుదల అతువున్న నీటిని అటుంచితే జూరాల ప్రాజెక్టు దాటుకుని ఇటు కృష్ణా నది ద్వారా, అటు సుంకేసుల ఆనకట్ట దాటుకుని తుంగభద్ర నది ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరిన నీటి ప్రావాహం 100 టీఎంసీలు మాత్రమే అని అధికారులు చెబుతున్నారు.శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జలవిద్యుత్ ఉత్పత్తి అనంతరం ప్రాజెక్టు నుంచి దిగువకు వదిలిన నీటివల్ల నా గార్జునసాగర్ ప్రాజెక్టుకు 40 టిఎంసీల వరకూ నీరు చేరుకుంది. ఎగువ నుంచి వచ్చిన కొద్దిపాటి నీటి నిలువలు కూ డా హరించుకుపోతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 854అడుగులకు పడిపోయింది. రిజర్వాయర్‌లో నీటినిలువలు 90.56టిఎంసీలకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టు నుంచి ఇటు సాగు, తాగునీటితోపాటు విద్యుత్ ఉత్పత్తి కోసం 13641క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. దిగువన నాగార్జన సాగర్‌లో నీటిమట్టం 522 అడుగులకు చేరుకుంది. నీటి నిలువ 153టిఎంసీల కు తగ్గిపోయింది. సాగర్‌లో తగినంత నీటిమట్టం లేకపోవటంతో ఎడమ కాలువకు నీటి విడుదల ప్రశ్నార్ధకంగా మా రింది. సాగర్ ప్రాజెక్టుపైన ఆధారపడి ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో సుమారు 6లక్షల ఎకరాల ఆయకట్టులో పంట లు వేసుకోలేని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఎలిమినేటి మాధవ రెడ్డి ఎత్తిపోతల పథకం కింద కూడా ఆయకట్టుకు నీరందే అవకాశాలు అడుగంటాయి.
వచ్చేనెల్లోనూ వర్షాలు లేనట్టేనా!
నైరుతి రుతుపవనాలు ఈ సారి వ్యవసాయరంగాన్ని ఎండగట్టాయి. జున్ ప్రారంభంలో అలవి మాలినా ఆలస్యం తో సకాలంలో వర్షాలు లేక పంటలు వేసుకోవటంలో జాప్యం జరిగింది. తీరా జుల్‌లో ఆధికవర్షాలతో ముంచెత్తిన రుతుపవనాలు ఆ తర్వాత ఆగస్ట్‌లో ఆడ్రస్ లేకుండా పోయా యి. గత మూడు వారాలుగా ముఖం చాటేశా యి. మరి కొద్ది గంటల్లో ఆగస్ట్ కూడా ముగిసిపోనుంది. కనీసం సెప్టెంబర్‌లోనైనా ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తాయన్న భరోసా లేకుండా పోయింది. ఈ విషయంలో వాతావరణ శాఖ కూడా ఆందోళవ్యక్తం చేస్తోంది. ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఏడాది రుతుపవనాలు అత్యంత బలహీనంగా మారాయి. ఎల్‌నినో ప్రభావం కారణంగా సెప్టెంబర్‌లోనూ వర్షాలు ఎక్కువగా కురిసే అవకా శం లేదని, ఇప్పటికే ఆగస్టు నెలంతా వాతావరణం పొడిగానే ఉందంటూ వాతావరణ శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చా యి. దీంతో దేశంలో ఈ ఏడాది జూన్‌లో లోటు వర్షపాతం ఏర్పడింది. ఆ తర్వాత రుతుపవనాలు చురుగ్గా మారడంతో దేశవ్యాప్తంగా అత్యధిక వర్షాపాతం నమోదైంది. జులైలో 489.9 మిల్లీమీటర్ల వర్షాపాతం రికార్డు కావటంతో లోటు తీరినట్లయ్యింది.
సాధారణ సగటు కంటే జూన్‌లో తొ మ్మిది శా తం తక్కువ లోటు ఉండగా, జులైలో 13శాతం ఎక్కువగా నమోదైంది. మరో వైపు సెప్టెంబర్ 17 నుంచి రుతుపవనాలు వెనక్కి మళ్లనున్నారు. రుతుపవనాల ఉపసంహరణ ఆలస్యం కారణంగా గత నాలుగేళ్లుగా సెప్టెంబర్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షాపాతం నమోదవుతున్నప్పటికీ, తూర్పు, ఉత్తరాది రాష్ట్రా ల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తున్నది. వార్షిక సగటు వర్షపాతంలో 70శాతం రుతుపవనాల సమయంలోనే నమోదు అవుతుండడం గమనార్హం.
1972 తర్వాత రాష్ట్రంలో అత్యల్ప వర్షపాతం
తెలంగాణలో 1972 తర్వాత ఆగస్టులో తెలంగాణలో అత్యల్పంగా వర్షాపాతం నమోదైంది. ఆగస్టులో కేవలం 74.4 మిల్లీమీటర్ల వర్షాపాతం మాత్రమే నమోదు కా గా.. ఇది సాధారణం కంటే 60శాతం తక్కువ. 1960 నుంచి రాష్ట్రంలో ఇంత తక్కువగా వర్షాపాతం నమోదవడం ఇది మూడోసారి. 1960లో 67.9 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదుకాగా, 1968లో 42.7 మిల్లీమీట ర్లు, 1972లో 83.2 మిల్లీమీటర్లు, ఇప్పుడు ఆగస్టులో 74.4 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదయింది. సాధారణంగా తెలంగాణలో 120 రోజులు వర్షాకాలం ఉంటుందని, 60-నుంచి 70 రోజులు మంచి వర్షాలు కురుస్తాయని, మిగిలిన రోజుల్లో అడపదడపా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో జూన్‌లో లోటు ఏర్పడిందని, జులైలో మంచి వర్షాలు కురిసినప్పటికీ ఆగస్టులో వర్షాభావ దుర్భిక్షం వెంటాడింది. లోటు వర్షపాతానికి ఎల్ నినో ప్రధాన కారణమని నిపుణులు వాతావరణశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News