Sunday, December 22, 2024

సూర్యాపేటలో వట్టె జానయ్య అరాచకాలు… వంద దాటిన ఫిర్యాదులు

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట జిల్లాలో వట్టె జానయ్య అరాచకాలకు అంతు లేకుండా పోయింది. ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నిందితుడిపై ఇప్పటికే ఫిర్యాదుల సంఖ్య వంద దాటింది. న్యాయం కోసం వెళితే ఇల్లు లాక్కున్న వట్టె జానయ్య బాధితురాలిని వ్యభిచారం చేసుకుని బతకమన్నాడంటూ మహిళ వాపోయింది. సూర్యాపేట జిల్లా దాస్యానాయక్ తండాకు చెందిన స్వాతి తన భర్తతో వచ్చిన విభేదాలతో వ్యవహారం విడాకుల వరకు వెళ్ళింది. దీంతో ఈ పంచాయితీ డిసిఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య వద్దకు వెళ్లింది. దాంతో దంపతుల పంచాయితీని జానయ్య క్యాష్ చేసుకున్నాడు.

వాళ్ల పేరు మీద ఇల్లును తన పేరున రాయించుకున్నాడు. పుట్టింటి వారు కట్నంగా ఇచ్చిన ఇల్లు లాగేసుకున్నాడు. న్యాయం కోసం వెళ్ళిన బాధిత మహిళను వీదిన పడేశాడు. ప్రస్తుతం బాధితురాలు కోర్టు చుట్టూ తిరుగుతూ తిప్పలు పడుతోంది. ఇదేంటని జానయ్యను ప్రశ్నిస్తే వయసులో ఉన్నావ్ కదా వ్యభిచారం చేసి డబ్బు సంపాదించుకో అంటూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని సదరు మహిళ కన్నీరుమన్నీరైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News