Monday, December 23, 2024

రైతన్నలకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్

- Advertisement -
- Advertisement -
  • రూ. 2.6 కోట్ల నష్టపరిహారం చెక్కులను రైతులకు అందించిన ఎమ్మెల్యే చల్లా

సంగెం: అకాల వర్షాలకు నష్టపోయిన రైతన్నలకు సీఎం కేసీఆర్ అండగా నిలిచి నష్టపరిహారం అందించి ఆదుకున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సంగెం మండలంలో పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే అకాల వర్షాలకు పంట నష్టపోయిన 2363 మంది రైతులకు రూ. 2.6 కోట్ల విలువైన చెక్కులను అందచేశారు.

గొల్లపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని వర్గాల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని, సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. అకాల వర్సాలకు దెబ్బతిన్న పంటలు నష్టపరిహారం ఇంత వరకు ఏ ప్రభుత్వం ఇవ్వలేన్నారు. రైతులను గోస పెట్టిన ప్రభుత్వాలే కాని వారి గోడు విన్న వారు లేరన్నారు. అలాంటిది ఒక్క సంగెం మండలంలో మార్చి నెలలో కురిసిన భారీ అకాల వర్షాలకు 7482 మంది రైతులకు చెందిన 7187 ఎకరాల్లో పంపలు దెబ్బతినగా రూ. 7.18 కోట్ల నష్టపరిహారం అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

మోసపూరిత రాజకీయాలు చేయడమే తప్పా ఏనాడు ప్రజల కష్టాల గురించి ఆలోచించిన న ప్రభుత్వాలు లేవన్నారు. తెలంగాణలో పార్టీలకు అతీతంగా పారదర్శక పరిపాలన కొనసాగిస్తూ ప్రజల సంక్షేమమే లక్షంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎమ్మెల్యే పర్యటనలో పల్లారుగూడ, వీఆర్‌ఎన్‌తండా, పోచమ్మతండా, వంజరపల్లి, మొండ్రాయి, ముమ్మడివరం, గొల్లపల్లి గ్రామాల్లో పంట నష్టపోయిన 2263 రైతులకు రూ. 2.6 కోట్ల విలువైన చెక్కులను అందించారు. గొల్లపల్లిలో రూ. 20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన, పల్లారుగూడలో రూ. 85 లక్షలతో నూతనంగా వేసిన సీసీ రోడ్డు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు కక్కెర్ల కుమారస్వామి, మేర్గు మల్లేశం, గూడ కుమారస్వామి, ఇజ్జగిరి స్వప్న అశోక్, కోడూరు రజిత రమేశ్, వరంగల్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు, ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ సుదర్శన్‌రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నరహరి, ఏఓ యాకయ్య, ఎంపిటిసిలు గుగులోతు వీరమ్మ, రాణి మొగిలి, కట్ల సుమలత నరేశ్, రైతు బంధు జిల్లా నెంబర్ పద్మ, గ్రామ రైతు కోఆర్డినేటర్లు చంద్రమౌళి, జలంధర్, మొగిలి, కొమురయ్య, ఏఈఓలు రాజేందర్, సమత, సాగర్, అఖిలతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, సొసైటీ, మార్కెట్ ఛైర్మన్లు, కమిటీ సభ్యులు, రైతు బంధు కన్వీనర్లు, సభ్యులు, రైతులు, ప్రజలు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News