Friday, November 15, 2024

సిపిఎం శిక్షణా తరగతులను జయప్రదం చేయండి

- Advertisement -
- Advertisement -

నర్సంపేట: సెప్టెంబరు 1, 2 తేదీల్లో నర్సంపేటలో సిపిఎం జిల్లాస్థాయి రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని, సమాయ సహకారాలు అందించి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య అన్నారు. బుధవారం నర్సంపేటలో సీపీఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య హాజరై మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలో వేలాది మంది పేదలు అనేక సంవత్సరాలుగా ఇంటి స్థలాలు లేక కిరాయి ఇళ్లలో ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తూ అద్దెలు కట్టలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

పదేళ్లు కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్కరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వలేదన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కడుతామని శంకుస్థాపనలు చేసి ఆ ప్రాంతంలో తట్ట మట్టి తీసిన పరిస్థితి లేదన్నారు. మొదట ఇంటి స్థలం ఉన్న వారికి రూ. 5 లక్షలు ఇస్తామని, అసెంబ్లీలో రూ. 3 లక్షలు ఇస్తామని చెప్పి ఏ ఒక్కరికీ ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా పేదలు వేసుకున్న గుడిసెలకు కనీస సౌకర్యాలు కల్పించి పట్టాలిచ్చి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను అమలుచేయాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో సీపీఎం పట్టణ కమిటీ సభ్యులు గడ్డమీది బాలకృష్ణ, ఇప్ప సతీష్, హన్మకొండ సంజీవ, తోటకూరి రాజేష్, వెంకన్న, జార్జ్ విక్టర్, వీరన్న, బాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News