Monday, December 23, 2024

నవవధువుపై నకిలీ బాబా అత్యాచారం.. వివాహం జరిగి మూడు నెలలే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దెయ్యం వదిలిస్తానని మాయమాటలు చెప్పి నవవధువుపై నకిలీ బాబా అత్యాచారం చేసినం సంఘటన బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం…హుస్సేనీఆలం ప్రాంతానికి చెందిన యువతికి మూడు నెలల క్రితం వివాహం జరిగింది. ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడంతో యువతి అత్తమామలు బండ్లగూడలో ఉంటున్న బజార్‌బాబా వద్దకు తీసుకుని వెళ్లారు.

యువతికి దెయ్యం పట్టిందని ఐదు దెయ్యాలు ఆమె ఒంటిపై ఉన్నాయని యువతి అత్తమామను నమ్మించాడు. దెయ్యం వదిలించే వరకు బయట ఉండాలని చెప్పడంతో వారు బయట ఉన్నారు. ఇదే అదునుగా భావించిన బజార్‌బాబా ఆమె కళ్లకు గంతలు కట్టి గధిలో బంధించి అత్యాచారం చేశాడు. బయటికి వచ్చిన యువతి వారితో కలిసి ఇంటికి వెళ్లింది. అప్పటి నుంచి మానసికంగా ఇబ్బంది పడిన యువతి బాబా అత్యాచారం చేసిన విషయం భర్త , అత్తమామకు చెప్పినా వారు స్పందించకుండా యువతిని ఇంట్లో బంధించారు.

ఈ విషయం తెలుసుకుని కూతురి ఇంటికి వచ్చిన ఆమె తల్లిదండ్రులకు బాధితురాలు తనపై జరిగిన అత్యాచారం విషయం చెప్పింది. వారి సాయంతో భవానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు సంఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదని, బండ్లగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సిందిగా చెప్పారు. బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన విషయం నకిలీ బాబాకు తెలియడంతో పరారయ్యాడు. బాధితురాలు బండ్లగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News