Monday, January 20, 2025

పేద ఆర్యవైశ్యుల కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తా

- Advertisement -
- Advertisement -

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

నాగర్‌కర్నూల్: పేద ఆర్యవైశ్యుల కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని టిపిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఆర్యవైశ్యులకు కాంగ్రెస్ పార్టీ నుంచి సీట్లు కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్యవైశ్యులది న్యాయమైన కోరిక అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అవసరమైన నిధులు కేటాయిస్తానని తెలిపారు. అనంతరం రేవంత్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని కల్వ సుజాత రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు.

ఈ కార్యక్రమంలో మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మినారాయణ, కార్యదర్శి కొండే మల్లికార్జున్, శంషాబాద్ గణేష్, రాష్ట్ర మహాసభ విద్యా కమిటీ చైర్మెన్ శ్రీశైలం, మల్లికార్జున్, సత్రం చైర్మెన్ మిడిదొడ్డి శ్యాంసుందర్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుల బచ్చు రామకృష్ణ, ఇరుకుల రామకృష్ణ, మహాసభ మహిళా కోశాధికారి కల్వ సుజాత, వంగూరు మండల అధ్యక్షులు మేడిశెట్టి సురేష్‌లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News