Monday, December 23, 2024

అధీర్ సస్పెన్షన్ వాపసు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌధురి సస్పెన్షన్‌ను ఎత్తివేతకు సభా హక్కుల కమిటీ బుధవారం ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది.చౌధురీ సస్పెన్షన్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి రోజు అయిన ఈ నెల 11న సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు స్పీకర్ నుంచి ఆయనపై సస్పెన్షన్ వేటుకు దారితీశాయి. తరువాత ఈ అంశం ప్రివిలేజెస్ కమిటీ విచారణకు వెళ్లింది. ఈ కమిటీ ఎదుట అధీర్ రంజన్ చౌధురి హాజరయ్యారు. జరిగిన దానికి చింతిస్తున్నట్లు , ఎవరిని కించపర్చడం తన ఉద్ధేశం కాదని బిజెపి సభ్యుడు సునీల్ కుమార్ సింగ్ అధ్యక్షతన జరిగిన కమిటీ భేటీలో వివరణ ఇచ్చుకున్నట్లు వెల్లడైంది. దీనిని పరిగణనలోకి తీసుకుని సస్పెన్షన్‌ను వెనకకు తీసుకుంటున్నట్లు తెలిపిన కమిటీ తమ నిర్ణయాన్ని లోక్‌సభ స్పీకర్ పరిశీలనకు త్వరలోనే పంపిస్తామని తెలిపారు. తుది నిర్ణయం స్పీకర్ నుంచి వెలువడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News