Tuesday, January 21, 2025

గాబన్‌లో సైనిక తిరుగుబాటు

- Advertisement -
- Advertisement -

లిబ్రేవిల్లే : చమురు సంపన్న మధ్య ఆఫ్రికా దేశం గాబన్‌లో బుధవారం సైనిక తిరుగుబాటు జరిగింది. ప్రెసిడెంట్ అలీ బోంగో ఒండిబాను సైన్యం గృహనిర్బంధంలో ఉంచింది. ఇటీవలి ఎన్నికలలో ఆయన విజేతగా ప్రకటించిన తరువాత ఈ దేశంలో ఆయన కుటుంబ 55 పాలన కొనసాగింపునకు రంగం సిద్ధం అయింది. ఈ దశలోనే ఆయన ఎన్నిక చెల్లనేరదంటూ హౌస్ అరెస్టు చేసిన సైన్యం తరువాత కుమారుడిని రాజద్రోహం కేసు కింద అరెస్టు చేసి వెంట తీసుకువెళ్లారు. చాలా కాలంగా ఈ అధ్యక్షుడి కుటుంబంపై పలు అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈ కుటుంబం దేశ చమురు సంపదను దోచుకుతింటోందని,

ఓ వైపు దేశ ప్రజలు అర్థాకలితో అలమటిస్తున్నారని విమర్శలు తలెత్తాయి. కాగా తనకు మద్దతు ప్రకటించాలని గృహ నిర్బంధం తరువాత ప్రజలకు టీవీ ఛానల్స్ ద్వారా బోంగో పిలుపు నిచ్చారు. వెంటనే ఆయన ప్రసారం నిలిచిపోయింది. దేశాధ్యక్షుడి ఎన్నిక చెల్లనేరదని, ఆయనను తాము అదుపులోకి తీసుకున్నామని సైన్యం ప్రకటించింది. దీనితో ప్రజలు ప్రత్యేకించి యువత పెద్ద ఎత్తున వీధుల్లోకి తరలివచ్చింది. డాన్స్‌లకు దిగింది. ఇన్నేళ్ల పీడ వదిలింది. ఇక స్వేచ్ఛ పొందామని పేర్కొంటూ వీరు సైనికులతో కలిసి జాతీయ గీతం ఆలాపించారు. పలు చోట్ల లాంగ్‌లీవ్ ఆర్మీ అని నినాదాలకు దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News