Sunday, December 22, 2024

ఎన్టీఆర్ కుటుంబంపై సజ్జల వ్యాఖ్యలకు పురందేశ్వరి కౌంటర్

- Advertisement -
- Advertisement -

అమరావతి: భారత రాష్ట్రపతి అధికారిక నివాసమైన రాష్ట్రపతి భవన్ రాజకీయాల్లోకి లాగబడుతుందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై పురందేశ్వరి నేరుగా మండిపడ్డారు. రాష్ట్రపతి భవన్‌లో ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం ఆవిష్కరణ కార్యక్రమంలో కుటుంబమంతా హాజరయ్యాం అని, కుటుంబ సభ్యుల హాజరుపై రాజకీయ రంగు పులమండం శోచనీయం అని పురందేశ్వరి మండిపడ్డారు. దానికి ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని గట్టిగా చెప్పారు. పురంధేశ్వరి టీడీపీ ప్రతినిధిగా మారారని గతంలో సజ్జల ఆరోపించారు. అంతేకాకుండా, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాసాన్ని ఇప్పుడు రాజకీయ ఎజెండాలకు వేదికగా వాడుకుంటున్నారని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News