విశాఖపట్నం: బాలిక మృతి కేసులో పశ్చిమ బెంగాల్ సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గత నెల 14న హాస్టల్ భవనం పైనుంచి పడి బంగాల్‌కు చెందిన బాలిక మృతి చెందింది. అనుమానాస్పద మృతిగా విశాఖ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రీతూ సాహూను హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపణ చేస్తున్నారు. బాలిక మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తల్లిదండ్రులు ఆశ్రయించారు. మమతా బెనర్జీ ఆదేశాలతో బంగాల్ సిఐడి అధికారులు రంగంలోకి దిగారు. విశాఖలో మూడు రోజులుగా బంగాల్ సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక చదివిన కళాశాల హాస్టల్ ఆస్పత్రిలో సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కళాశాల ఆస్పత్రిలో రికార్డులు, సిసి కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దర్యాప్తు తరువాత బాలిక మృతి కేసు సెక్షన్‌ను పోలీసులు మార్చారు. బాలిక మృతిపై విచారణ తరువాత సెక్షన్ 304(2) కింద కేసు నమోదు చేశారు. రీతూకు వైద్యులు చికిత్స చేస్తున్నప్పుడు ఆమె సహకరించలేకపోవడంతో దానిపై కూడా సిఐడి అధికారులు దృష్టి పెట్టారు.
వైజాగ్ లో బాలిక మృతి… బెంగాల్ సిఐడి అధికారులు దర్యాప్తు
- Advertisement -
- Advertisement -
- Advertisement -