Saturday, December 21, 2024

సత్యదేవ్ ‘జీబ్రా’ డబ్బింగ్ షురూ

- Advertisement -
- Advertisement -

టాలెంటెడ్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ కథానాయకులుగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూనిక్  క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జీబ్రా. లక్‌ ఫేవర్స్‌ ది బ్రేవ్‌.. అన్నది ట్యాగ్ లైన్.

పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ పతాకాలపై ఎస్ఎన్ రెడ్డి, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్, జెన్నిఫర్ పిసినాటో హీరోయిన్లుగా నటిస్తుండగా, ప్రముఖ నటుడు సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

తాజాగా హీరో సత్యదేవ్ ‘జీబ్రా’ డబ్బింగ్ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా స్టూడియో నుంచి డబ్బింగ్ చెబుతున్న ఫోటోలని అభిమానులతో పంచుకున్నారు. ఇదివరకు ఎన్నడూ చూడని ఆర్ధికనేరాల నేపధ్యంలో యధార్ధ సంఘనట స్ఫూర్తితో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్‌ సంగీతం ఓ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సుమన్ ప్రసార బాగే సహ నిర్మాతగా వున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ సత్య పొన్మార్. మీరాఖ్ డైలాగ్స్ రాస్తుండగా, అనిల్ క్రిష్ ఎడిటర్. ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం హిందీ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News