- Advertisement -
సదాశివనగర్ : 44 వ జాతీయ రహాదాపై కారు దగ్దమైన ఘటన సదాశివనగర్ మండలం పద్మాజివాడి గ్రామ సమీపంలో గురువారం జరిగింది. నిజామాబాద్ పట్టణానికి చెందిన పి.దినేష్, యండి.జలీల్ ఇద్దరు ఏపి09 బిసి 0198 నంబరు గల ఫోర్డ్ కారులో నిజామాబాద్ నుండి తూప్రాన్ కు బయలుదేరారు. మార్గమద్యలో సదాశివనగర్ మండలంలోని పద్మాజివాడి గ్రామ సమీపంలో కి రాగానే వీళ్లు ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
వెంటనే అప్రమత్తమై కారును పక్కకు ఆపి దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం తెలువగానే సదాశివనగర్ ఎస్సై రాజు పోలీస్ సిబ్బందితో కలసి అక్కడకు చేరుకుని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేసినప్పటికి కారు పూర్తిగా కాలిపోయింది. పోగ మంటలు పెద్దెత్తున చెలరేగడంతో ఎస్సై రాజు నేషనల్ హైవే, పోలీస్ సిబ్బంది తో కలసి వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చేశారు.
- Advertisement -