న్యూఢిల్లీ: చైనా వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత పురుషులు, మహిళా హాకీ జట్లను గురువారం ఎంపిక చేశారు. చైనాలో హాంగ్‌జౌలో వచ్చే నెలలో ఆసియా క్రీడలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మెగా క్రీడల కోసం భారత హాకీ జట్లను ప్రకటించారు. భారత మహిళా జట్టుకు సవిత, పురుషుల టీమ్‌కు హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. పురుషుల జట్టులో పలువురు సీనియర్లకు చోటు లభించలేదు. యువ ఆటగాడు కార్తీ సెల్వం, సీనియర్ ఆటగాడు ఆకాశ్‌దీప్ సింగ్‌లకు జట్టులో స్థానం దక్కలేదు. అయితే లలిత్ ఉపాధ్యాయ జట్టులోకి తిరిగి వచ్చాడు. హార్దిక్ సింగ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
జట్ల వివరాలు:
పురుషుల జట్టు: పిఆర్ శ్రీజేష్, క్రృష్ణన్ పాఠక్, వరుణ్ కుమార్, అమిత్ రోహిదాస్, జర్మన్‌ప్రీత్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), సంజయ్, సుమిత్, నీలకంఠ శర్మ, మణ్‌ప్రీత్ సింగ్, వివేక్ సాగర్, శంషేర్ సింగ్, మణ్‌దీప్ సింగ్, సుఖ్‌జీత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్.
మహిళా టీమ్: సవిత (కెప్టెన్), బిచ్చు దేవి, దీపిక లాల్‌రెమ్‌సియామి, మోనిక, నవ్‌నీత్ కౌర్, సోనికా ఉడిత, ఇషికా చౌదరి, దీప్ గ్రేస్ ఎక్కా, వందన కటారియా, సంగీత కుమారి, వైష్ణవి, నిక్కి ప్రధాన్, సుశీల చాను, సలీమా టెటె.
ఆసియా క్రీడలకు హాకీ జట్ల ఎంపిక
- Advertisement -
- Advertisement -
- Advertisement -