Sunday, January 19, 2025

అక్రమాల పుట్ట.. అదానీ చిట్టా

- Advertisement -
- Advertisement -

షేర్ల విలువ పెంచుకోవడానికి అక్రమమార్గంలో పెట్టుబడులు

మారిషస్ ఫండ్ ద్వారా మిలియన్ల డాలర్లు

సూత్రధారులు నాసీర్ అలీ, చాంగ్ చుంగ్ లింగ్‌లు

వీరిద్దరికీ అదానీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు
అదానీ సోదరుడు వినోద్ అదానీ పాత్రపై బలపడుతున్న అనుమానాలు

అక్రమాల చిట్టా విప్పిన మరో అంతర్జాతీయ సంస్థ ఒసిసిఆర్‌పి

ఖండించిన అదానీ గ్రూప్

అన్ని నిబంధనలు పాటించామని వివరణ

న్యూఢిల్లీ: మరో అంతర్జాతీయ సంస్థ ఒసిసిఆర్‌పి బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన గ్రూప్ కంపెనీలపై తీవ్ర ఆరోపణలు చేసిం ది. అదానీ గ్రూప్ ఇన్వెస్టర్లు తమ సొంత షేర్లను రహస్యంగా కొనుగోలు చేయడం ద్వారా మార్కెట్‌లో మిలియన్ల డా లర్లు పెట్టుబడి పెట్టారు. అదానీ గ్రూప్ షేర్లలో పెట్టుబడి పెట్టడానికి మారిషస్ ఆధారిత అక్రమ నిధులను ఉపయోగించారని నివేదిక పేర్కొంది. షేర్ల విలువ పెంచుకోవడానికి ఆడిన ఈ డ్రామా లో గౌతమ్ అదానీ కుటుంబానికి సన్నిహితులైన వారే కీలకపాత్ర పోషించారని ఒసిసిఆర్‌పి తాజా గా బయటపెట్టింది. ఈ వార్త వెలువడగానే స్టాక్‌మార్కెట్లో అదానీ గ్రూప్ స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. ఒసిసిఆర్‌పి (ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్) గురువారం ఈ నివేదికను విడుదల చేసింది.

నివేదికల ప్రకారం, ఆరోపణలు ఉన్న అదానీ కుటుంబానికి చెందిన వ్యాపార భాగస్వాములు మారిషస్ ఫండ్ ద్వారా అదానీ గ్రూప్ స్టాక్స్‌లో మిలియన్ల డాలర్లు పెట్టుబడి పె ట్టారు. అనేక పన్నుల స్వర్గధామానికి చెందిన ఫైల్‌లు, అంతర్గత అదానీ గ్రూప్ ఇమెయిల్‌ల పరిశీలించడం ద్వా రా ఒసిసిఆర్‌పి తన దర్యాప్తులో ఇలాంటి రెండు కేసులు బయటపడ్డాయని తెలిపింది. ఈ కేసుల్లో అదానీ గ్రూప్ పెట్టుబడిదారులు విదేశీ సంస్థల ద్వారా అదానీ స్టాక్‌లను కొనుగో లు చేయడం, అమ్మడం చేశారు. పెట్టుబడిదారులు నాసిర్ అలీ షాబాన్ అహ్లీ, చాంగ్ చుం గ్-లింగ్‌లకు అదానీ కుటుంబంతో దీర్ఘకాల వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఒసిసిఆర్‌పి పేర్కొంది.

గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ కూడా గ్రూప్‌లోని కంపెనీలు, సంస్థలలో డైరెక్టర్‌గా, వాటాదారుగా పనిచేశారు. వినోద్ అదానీ పెట్టుబడుల విషయం లో అవతవకలు ఉన్నాయని సంస్థ ఆరోపించింది. జనవరిలో అదానీ గ్రూప్‌పై అమెరికా -ఆధారిత షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత ఈ కొత్త నివేదిక వచ్చింది. హిడెన్‌బర్గ్ కూడా మారిషస్ వంటి పన్ను స్వర్గధామాల్లోని సంస్థల ద్వారా అదానీ గ్రూప్ అక్ర మ వ్యాపార లావాదేవీలను నిర్వహించినట్టు ఆరోపించింది. అదానీకి చెంది న లిస్టెడ్ కంపెనీల్లో కొన్ని గుప్తనిధులు వాటాలు కలిగి ఉన్నాయని ఆ నివేదికలో పేర్కొంది. ఈ క్లెయిమ్‌లను తప్పుదారి పట్టించేవిగా, సాక్ష్యం లేనివిగా కంపెనీ వివరించింది. కంపెనీ చట్టాలకు లోబడి ఉందని పేర్కొంది.

ఒసిసిఆర్‌పి నివేదికపై అదానీ గ్రూప్ స్పందన
ఒసిసిఆర్‌పి నివేదికపై ఒసిసిఆర్‌పి స్పందిస్తూ, ఈ ఆరోపణలు నిరాధారమైనవి మాత్రమే కా కుండా, హిండెన్‌బర్గ్ ఆరోపణలను పునరావృ తం చేస్తున్నాయని తెలిపింది. అన్ని నిబంధనలను పాటించినట్లు కంపెనీ తెలిపింది. పరు వు తీయడానికి, లబ్ధి పొందేందుకు పన్నిన కుట్ర అ ని పేర్కొంది. ఒసిసిఆర్‌పి చేసిన ఆరోపణలు దశాబ్దం క్రితం మూసివేసిన కేసులకు సంబంధించినవని అదానీ గ్రూప్ తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News