Tuesday, April 1, 2025

రాజారెడ్డి రాజ్యాంగంలో వీరికి ప్రత్యేక హక్కులు ఇచ్చారా?: లోకేశ్

- Advertisement -
- Advertisement -

అమరావతి: సిఎం జగన్ మోహన్ రెడ్డి అణిచివేతే తమ తిరుగుబాటు అని టిడిపి నేత లోకేశ్ హెచ్చరించారు. యువగళం పాదయాత్రలో లోకేశ్ ప్రసంగించారు. అయ్యన్నపాత్రుడు విమర్శలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే సిఎం జగన్, వైసిపి నేతల వ్యాఖ్యలను ఏమనాలని ప్రశ్నించారు. వైసిపి నేతలు, మంత్రులు బూతు వ్యాఖ్యలు మాట్లాడుతున్నారని, కానీ పోలీసులకు మాత్రం ప్రవచనాల్లా వినిపిస్తున్నాయా? అని ఎద్దేవా చేశారు. రాజారెడ్డి రాజ్యాంగంలో వైసిపి నేతలకు ప్రత్యేక హక్కులు ఇచ్చారా? అని లోకేశ్ నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News