Sunday, November 24, 2024

సీఎం కేసీఆర్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ

- Advertisement -
- Advertisement -

ముత్తంగిలో మన ఊరు మన బడిని ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు: మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ వచ్చిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చెప్పారు. శుక్రవారం మండల పరిధిలోని ముత్తంగి గ్రామంలో రు. 2 కోట్ల 29 లక్షల వ్యయంతో చేపట్టిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం , వంట గదులను గ్రామ సర్పంచ్ ఉపేందర్, స్థానిక ప్రజాప్రథి నిధులతో కలిసి ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ పాఠశాలలు కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ఫ్రభుత్వంలో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా పనిచేస్తున్నాయన్నారు.మన బడి పథకం ద్వారా నియోజకవర్గంలో 55 పాఠశాలల్లో అభివృద్ది పనులు చేపట్టామన్నారు.విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల్లో చదువుకోవడానికి అన్ని విధాల సౌకర్యాలు కల్పించడంతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల్లో చదువుకోవడానికి ఆసక్తి కనపరుస్తున్నారన్నారు.

విద్యార్థులకు అవసరమైన అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులు నియమించడం జరిగిందన్నారు.ప్రాభుత్వ పాఠశాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగడమే కాకుండా అద్బుతమైన ఫలితాలు వస్తున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఎంపిపిలు సుష్మశ్రీ వేణుగాపాల్ రెడ్డి, స్వప్న శ్రీనివాస్, జెట్పిటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి,ఆత్మ కమిటీ చైర్మణ్ కుమార్ గౌడ్ ఉప సర్పంచ్ లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News