Friday, December 27, 2024

జమిలి ఎన్నికలపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ..

- Advertisement -
- Advertisement -

జైపూర్: జమిలి ఎన్నికలపై ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్న వేళ కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ ఈ అంశంపై స్పందించారు. ప్రస్తుతం కమిటీని మాత్రమే ఏర్పాటు చేశామన్నారు. ‘కమిటీ నివేదిక అందించిన తర్వాత దానిపై చర్చలు ఉంటాయి. పార్లమెంటు పరిపక్వమైనది. ఆందోళన పడవద్దు’ అని ఆయన అన్నారు.పార్లమెంటు ప్రత్యేక సమావేశాల అజెండాపై కూడా 3 4 రోజుల్లో తెలుపుతామన్నారు. పార్లమెంటు ప్రజాస్వామ్యానికి తల్లివంటిదని ఆయన వ్యాఖ్యానించారు. సముద్ర మథనం తర్వాత అమృతం ఎలా ఉద్భవిస్తుందో ఈ అంశంపై చర్చల తర్వాత ఒక స్పష్టత వస్తుందన్నారు.‘భారత్ ప్రపంచంలోనే అతతిపెద్ద ప్రజాస్వామ్యం. భారత్‌ను ప్రజాస్వామ్యానికి తల్లివంటిదని అంటారు. మారుతున్న ప్రజాస్వామ్యంలో కొత్త ఆలోచనలు వస్తుంటాయి. వాటిపై చర్చ జరగాలి. రేపే అంతా జరిగిపోతుందని మేము చెప్పడం లేదు’ అని శుక్రవారం జైపూర్ విమానాశ్రయంలో ప్రహ్లాద్ జోషీ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News