- Advertisement -
హైదరాబాద్ ః ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మరోసారి గడువు పొడిగించారు. ఈ నెల 16వ తేదీ వరకు పొడిగిస్తూ రూ. 1000 ఆలస్య రుసుంతో అవకాశం కల్పించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ప్రవేశాలు పొందవచ్చు. ఇంటర్ ఫస్టియర్లో ఇప్పటి వరకు 4,92,873 మంది చేరారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అయితే 83,177 మంది విద్యార్థులు చేరగా, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో 3,11,160 మంది విద్యార్థులు చేరినట్లు తెలిపారు. ఇంటర్ బోర్డు చేత గుర్తింపు పొందిన కాలేజీల్లో మాత్రమే ప్రవేశాలు పొందాలని విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ సూచించారు. అనుమతి పొందిన కాలేజీల జాబితాను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచామని, ఆయా కాలేజీల్లో మాత్రమే ప్రవేశాలు పొందాలని పేర్కొన్నారు.
- Advertisement -