హైదరాబాద్ ః ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. గత మార్చిలో దరఖాస్తులు చేసినవారికి సవరణ అవకాశం కల్పిస్తూ గతంలో దరఖాస్తు చేయనివారు బదిలీ కోసం కొత్తగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర విద్యాశాఖకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన పంపించారు. ఈ ప్రతిపాదనలో షెడ్యూల్ తేదీలను సైతం ప్రకటించారు. ఈ నెల 3 నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని టీచర్లు పదోన్నతులు బదిలీలు కోరుకుంటున్న వారు ఈ నెల 3 నుంచి 5 వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. ఈనెల 6,7 తేదీల్లో ఆన్‌లైన్ దరఖాస్తు పత్రులను జిల్లా విద్యాధికారి కార్యాలయంలో అందజేయాలి అదే విధంగా 8, 9 తేదీల్లో దరఖాస్తు చేసిన వారి పేర్ల జాబితాను విడుదల చేస్తారు. 10,11 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ, 12,13 సీనియారిటీ జాబితా విడుతల, 14వ తేదీన ఎడిట్ చేసుకునేందుకు ఆప్షన్ అవకాశం ఇస్తారు.
సెప్టెంబర్ 15న ఆన్‌లైన్‌లో ప్రధానోపాధ్యాయుల బదిలీలు జరుపుతారు. 16న ప్రధానోపాధ్యాయుల ఖాళీల ప్రదర్శన, 17,18,19 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి ఇస్తారు. 20,21 తేదీల్లో ఖాళీ అయిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులను డిస్ ప్లే చేస్తారు. 21న వెబ్ ఆప్షన్ల ఎంపిక, 22న ఎడిట్ ఆప్షన్ అవకాశం కల్పిస్తారు. 23,24 స్కూల్ అసిస్టెంట్ బదిలీలు జరుగుతాయి. దానికనుగుణంగా 24 స్కూల్ అస్టింట్ ఖాళీలు వెల్లడిస్తారు. 26,27,28 ఎస్జీటీనుంచి స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతులు ఇస్తారు. 29,30,31 ఎస్‌జిటిల ఖాళీల ప్రదర్శన, అక్టోబర్ 2న ఎడిట్ ఆప్షన్స్ ఉంటాయి. అక్టోబర్ 3న ఎస్జీటీ, భాషాపండితులు, పీఈటీల బదిలీలు చేస్తారు. అక్టోబర్ 5 నుంచి 19వరకు అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వనున్నారు.
విద్యాశాఖ సూచించిన ప్రతిపాదిత నిబంధనలు …..
సెప్టెంబర్ ఒకటో తేదీ కటాఫ్ డేట్ గా లాంగ్ స్టాండింగ్ ఉపాధ్యాయులకు 8 సంవత్సరాలు, ప్రధానోపాధ్యాయులకు 5 సంవత్సరాల నిబంధన వర్తించేలా ప్రతిపాదించింది.5 నుంచి 8 ఏండ్లు పూర్తిచేసుకున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల స్థానాలను ఖాళీలుగా జాబితాలో చేరుస్తారు.పదవి విరమణ మూడు సంవత్సరాలలోపు సర్వీసున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఉంది.అన్ని రకాల పదోన్నతులకు సంబంధించి సీనియారిటీ జాబితాలను సిద్ధం చేసుకోవాలని రాష్ట్రస్థాయి అధికారులు జిల్లా అధికారులకు సూచనలు ఇచ్చారు.కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. గతంలో దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల దరఖాస్తులను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని అదనంగా స్పాజ్ బదిలీలకు పాయింట్లు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.సెప్టెంబర్ ఒకటి నాటికి 50 సంవత్సరాల లోపు వయస్సు ఉండి బాలికల పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు నిర్బంద బదిలీ వర్తింప జేస్తూ ప్రతిపాదనలు పంపింది.