Monday, December 23, 2024

టిడిపి నేతలకు ఎన్టీఆర్ నాణేలను బహుకరించిన కంభంపాటి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : నందమూరి తారకరావు (NTR) శత జయంతి స్మారకార్థం విడుదల చేసిన రూ. 100 వెండి నాణేనికి భారీ స్పందన లభిస్తోంది. హైదరాబాద్‌లోని సైఫాబాద్, చర్లపల్లి నాణేల ముద్రణ కేంద్రాల్లో ఈ వెండి నాణేల విక్రయాలు ప్రారంభమయ్యాయి. నాణేలను కొనుగోలు చేయడం కోసం ప్రజలు ఆయా కేంద్రాల వద్దకు వస్తున్నారు. మొన్న ఒక్క రోజులోనే 10 వేలకు పైగా ఆ నాణేల విక్రయాలు జరిగినట్లు తెలుసుకున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి కంభంపాటి రామమోహన రావు ఈ మేరకు ఆ నాణేలను తెప్పించుకుని పార్టీ నేతలకు బహుకరించారు.

ముందుగా తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు ఎన్‌టిఆర్ వంద రూపాయల కాయిన్‌ను శుక్రవారం ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌లో బహుకరించి ఆ నాణేం విశిష్టతను తెలియజేశారు. ఈ నాణెం త్వరలోనే ప్రజలందరికీ అందుతుందని కంభంపాటి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నాణేలను కాసానితో పాటు పార్టీ సీనియర్ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు , అరవింద్ కుమార్ గౌడ్, జాతీయ పార్టీ ఉపాధ్యక్షుడు చిలువేరు కాశీనాథ్, జాతీయ పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి లకు కూడా అందజేసినట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News