Monday, December 23, 2024

మోడీ నివాసంలో అమిత్ షా, నడ్డా చర్చలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షులు జెడి నడ్డా, బిజెపికి చెందిన కొందరు ప్రముఖ నేతలు ప్రధాని మోడీని ఆయన నివాసంలో కలిశారు. ముందుగా అమిత్ షా అక్కడికి వెళ్లినట్లు, సుదీర్ఘంగా చర్చించినట్లు వెల్లడైంది. దేశంలో ముందస్తు ఎన్నికలా? లేక జమిలి ప్రక్రియతో లోక్‌సభ ఎన్నికల వాయిదానా? లోక్‌సభకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి కలిపి జరిపించడమా? వంటి వాటిపై వీరి మధ్య ప్రధానంగా మంతనాలు జరిగాయి. తరువాత బిజెపి అధ్యక్షులు నడ్డా అక్కడికి చేరుకున్నారు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఏర్పాటు నిర్ణయం తరువాత ప్రధానితో అమిత్ షా, నడ్డా భేటీ కావడం, శుక్రవారమే జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు కావడం వంటి పరిణామాలు కీలకంగా మారాయి. ముంబైలో జరిగిన ఇండియా కూటమి భేటీ పరిణామాలపై కూడా ప్రధాని వీరితో చర్చించినట్లు వెల్లడైంది. ప్రతిపక్ష నేతలు వచ్చే రెండు మూడు రోజులలో వరుసగా ఢిల్లీకి చేరుకుంటారని , జమిలి ప్రక్రియపై ప్రతిఘటనకు రంగం సిద్ధం చేసుకుంటారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే మోడీ షా భేటీ జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News