Monday, December 23, 2024

యుపిఐ క్యుఆర్ కోడ్ అడిగిన కస్టమర్‌కు ఆ మహిళ ఇచ్చిన రియాక్షన్(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

వెబ్ డెస్క్: డిజిటల్ ఇండియా ఎంత అభివృద్ధి చెందిందో అందరం నిత్యం కళ్లారా చూస్తున్నాం. రోడ్డు పక్కన ఉండే చాయ్ దుకాణాల నుంచి స్టార్ హోటళ్ల వరకు డిజిటల్ మనీ చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే రోడ్డు మీద కూరగాయలు విక్రయించే ఒక మహిళ యుపిఐ క్యుర్ కోడ్‌ను అతికించడానికి ఎంచుకున్న ఒక ప్రత్యేక చోటే ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆ మహిళ తెలివితేటలకు, వినూత్న ఆలోచనలకు నెటిజన్లు ఫిదాఅవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సాధారణ ప్రజలనే కాదు కేంద్ర మంత్రులను కూడా ఆకట్టుకుంటోంది. వారిచేత ఈ వీడియోను షేర్ చేయిస్తోంది.

కూరగాయలు అమ్ముతున్న ఒక మహిళ వద్ద కొనుగోలు చేసిన ఒక కస్టమర్ డిజిటల్ చెల్లింపు కోసం క్యుర్ కోడ్ గురించి అడిగాడు. వెంటనే ఆ మహిళ కూరగాయల బరును తూచే యంత్రంపైన పెట్టిన గిన్నెను తిప్పి పట్టుకుని చూపించగా దానిపైన క్యుఆర్ కోడ్ అతికించి ఉంది. ఆ వ్యక్తి దాన్ని చూసి ఆ కస్టమరే కాదు నెటిజన్లు కూడా విస్మయం చెందారు. సాధారణంగా గోడకో, చెక్కకో అతికించి ఉంచే క్యుఆర్ కోడ్ ఇలా తూకం యంత్రంపైన గిన్నె వెనుక అతికించి ఉండడం ఇదే మొదటిసారి చూస్తున్నామని, డిజిటల్ ఇండియా ఎంత ముందుకెళ్లిందో చెప్పడానికి ఇదే నిదర్శనమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో ఇప్పటికే 1 కోటీ 30 లక్షల మందికిపైగా వీక్షించగా 15 లక్షల మంది లైక్ చేయడం విశేషం.

కేంద్ర రైల్వేలు, కమ్మూనికేషన్లు, ఎలెక్ట్రానిక్స్, ఇటి శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ఈ వీడియోను తన సొంత ఎక్స్ హ్యాండిల్(ఇదివరకటి ట్విట్టర్)పై షేర్ చేశారు. డిజిటల్ ఇండియా కొత్త రికార్డుకు చేరుకుందని, 2023 ఆగస్టు నాటికి యుపిఐ పేమెంట్ లావాదేవీలు రూ. 1000 కోట్లు దాటాయని ఆయన రాసుకొచ్చారు. ఇక డిజిటల్ ఇండియాలో నగదు చెల్లింపులకు కాలం చెల్లిందంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News