Tuesday, December 24, 2024

ఆదిత్య ఎల్1 కక్ష్యలోకి ప్రవేశించింది: ఇస్రో ఛైర్మన్

- Advertisement -
- Advertisement -

ఆదిత్య ఎల్1, రాకెట్ నుంచి విజయవంతంగా విడిపోయి కక్ష్యలోకి ప్రవేశించింది. దీంతో శ్రీహరికోట షార్ లో శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. శనివారం ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోట నుంచి ఆదిత్యా ఎల్ 1 ఉపగ్రహం పిఎస్‌ఎల్‌వి 57 రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లింది. దీంతో ఆదిత్య ఎల్1 కోసం పని చేసిన శాస్త్రవేత్తలకు భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం(ఇస్రో) ఛైర్మన్ సోమనాథ్ అభినందనలు తెలిపారు. ఆదిత్య ఎల్1 లాంచింగ్ విజయవంతమైందని సోమనాథ్ వెల్లడించారు. పిఎస్ఎల్వి తన పనిని విజయవంతంగా పూర్తి చేసిందని, ఉపగ్రహాన్ని వాహకనౌక నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు. భారత తొలి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య ఎల్1 ప్రయాణం ప్రారంభమైందని, లెగ్రాంజ్ పాయింట్ దిశగా ఆదిత్య ఎల్1 ప్రయాణిస్తోందని తెలిపారు.

కాగా, ఆదిత్యా ఎల్1 ద్వారా సూర్యుడిపై ఇస్రో పరిశోధనలు చేయనుంది. ఆదిత్యా ఎల్1 వ్యోమనౌక 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లెగ్రాంజ్ పాయింట్ కు దాదాపు 4 నెలల కాలంలో చేరుకుంటుందని ఇస్రో వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News