Friday, December 20, 2024

ఆసియాకప్ 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..

- Advertisement -
- Advertisement -

పల్లెకెలె: ఆసియాకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్థాన్ జట్టు ఢీకొనబోతున్నాయి. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యచ్ పై అటు పాకిస్థాన్, ఇటు ఇండియాలో లక్షలాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే, ఈ మ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉండడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. వర్షం రాకుండా, మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నారు. కాగా, నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రికార్డు విజయాన్ని సాధించిన పాకిస్థాన్ ఈ మ్యాచ్‌లో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. భారత్ కూడా పాకిస్థాన్‌ను ఓడించి టోర్నీలో శుభారంభం చేయాలనే పట్టుదలతో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News