Monday, December 23, 2024

అందోల్‌లో బిఆర్‌ఎస్ గెలుపు ఖాయం

- Advertisement -
- Advertisement -
  • బిఆర్‌ఎస్ నాయకుడు కొనింటి ప్రవీణ్ కుమార్

మునిపల్లి: అందోల్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా రెండోసారి బరిలో ఉన్న అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ గెలుపే లక్షంగా పని చేస్తామని బీఆర్‌ఎస్ నాయకుడు కొనింటి ప్రవీణ్ కుమార్ అన్నారు.ఈ సందర్బంగా శనివారం మండల కేంద్రమైన మునిపల్లిలో స్థానిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తరుపున పోటీ చేసి సుమారు 12వేల మెజార్టీతోగెలుపొందిన విషయాన్ని ఇతర పార్టీల నాయకులు గుర్తు పెట్టుకోవాలన్నారు.

అందుకు రాబోయే ఎన్నికల్లో కూడా రెండో సారి సైతం రాష్ట్రంలో అందోల్‌లో బీఆర్‌ఎస్ గెలువడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దామోదర్ రాజనర్సింహ్మ అందోల్ నియోజకవర్గాన్ని అభివృద్ది చేసిండని ఆ పార్టీ నాయకులు గొ ప్పలు చెప్పడం కాదు..గత ఎన్నికల్లో అందోల్ ప్రజలే తగిన గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో కూడా అందోల్ ప్రజలు బీఆర్‌ఎస్ అభ్యర్థి చంటి పక్కా లోకల్‌కు ఓటు గెలుపించేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. అలాగే అందోల్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్కటై బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు.

కాని అందోల్ ప్రజలు మాత్రం చంటి క్రాంతికిరణ్‌ను మరోసారి ఎమ్మెల్యేగా గెలుపుకు కృషి చేద్దామన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు, కార్యకర్తలను పట్టించుకోకపోవడంతోనే పార్టీని వీడి అందోల్ ఎమెల్యే చంటి క్రాంతికిరణ్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరుఏతున్నారన్నారు. బీఆర్‌ఎస్‌లో చేరిన ప్రతి కార్యకర్తలను ఎమ్మెల్యే క్రాంతికిరణ్ కళ్లల్లో పెట్టి చూసుకుంటున్నారన్నారు. అందుబాటులో ఉండే నాయకునికి ప్రజలంతా ఓటు వేసి గెలుపించుకోవాలనిఆయన విజ్ఙప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News