Saturday, January 4, 2025

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ద్ధరించాలి

- Advertisement -
- Advertisement -
  • తపస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బీరకాయల తిరుపతి

నంగునూరు: ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట అశానిపాతంగా తయారైన నూతన పెన్షన్ విధానం (సిపిఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బీరకాయల తిరుపతి డిమాండ్ చేశారు. శనివారం నంగునూరు మండలంలోని వివిధ పాఠశాలల్లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులను ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని అలాగే ప్రమోషన్లలో ఉపాధ్యాయులకు నాట్ విల్లింగ్ ఆప్షన్ అవకాశం కల్పించాలని కోరారు. అనంతరం తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వంగ నర్సిరెడ్డి మాట్లాడుతూ తక్షణమే పీఆర్సీ కమిటీని నియమించాలని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఐఆర్ ప్రకటించాలన్నారు.

2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఊడెం రఘువర్ధన్ రెడ్డి, తపస్ జిల్లా ఉపాధ్యక్షులు గడీల శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి కత్తుల రాంరెడ్డి, కార్యవర్గ సభ్యులు గోవర్ధన్, రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చంద్రకాంత్, ముండ్రాతి రాములు, రాంగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News