Monday, December 23, 2024

ట్రక్కుకు కారు ఢీకొని ముగ్గురు పోలీసులు మృతి..

- Advertisement -
- Advertisement -

ఖర్‌గోన్ : మధ్యప్రదేశ్ ఖర్‌గోనె జిల్లాలోని బాదూద్ గ్రామానికి సమీపాన బుధవారం తెల్లవారు జామున పోలీస్‌లతో వెళ్తున్న కారు స్టేషనరీ ట్రక్కుకు ఢీకొని కారులోని ముగ్గురు పోలీస్‌లు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఇద్దరు సబ్‌ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుల్ అక్కడిక్కడే చనిపోయారని ఎస్‌పి ధర్మవీర్ సింగ్ తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు పోలీస్‌లు తీవ్రంగా గాయపడగా, వారిని ఇండోర్ ఆస్పత్రికి తరలించినట్టు ఎస్‌పి చెప్పారు. మతపరమైన ఊరేగింపులో డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగివస్తండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News