Saturday, November 23, 2024

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో శాటిలైట్ టెర్మినల్ పనుల పురోగతి తనిఖీ

- Advertisement -
- Advertisement -

ద.మ. రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్

మన తెలంగాణ / హైదరాబాద్ : జంటనగరాల్లో చర్లపల్లి రైల్వేస్టేషన్ నాలుగో అతిపెద్ద ప్యాసింజర్ టెర్మినల్‌గా అవతరించనుందని, దీనిని విమానాశ్రయాలతో సమానంగా ఆధునిక సౌకర్యాలతో కొత్త టెర్మినల్‌ను అభివృద్ధి చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ప్రత్యామ్నాయ కోచింగ్ టెర్మినల్‌గా అభివృద్ధి చేయడానికి, తద్వారా రైల్వే బోర్డు 221 కోట్ల రూపాయల సవరించిన అంచనా వ్యయంతో మంజూరు చేసిందని జిఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. ఈ మేరకు జంట నగరాలకు కొత్త , ప్రత్యామ్నాయ కోచ్ టెర్మినల్‌గా అభివృద్ధి చేస్తున్న చర్లపల్లి రైల్వే స్టేషన్‌లోని శాటిలైట్ టెర్మినల్‌ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.

ఈ తనిఖీల్లో జిఎం అరుణ్ కుమార్ జైన్ వెంట నీరజ్ అగర్వాల్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (కన్‌స్ట్రక్షన్), బి. నాగ్య, ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ ( ద.మ. రైల్వే మేనేజర్), భరతేష్ కుమార్ జైన్, డివిజనల్ రైల్వే మేనేజర్, సికింద్రాబాద్ , ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రయాణికుల సౌకర్యాలకు సంబంధించిన పనుల పురోగతిని జనరల్ మేనేజర్‌కు అధికారులు వివరించారు. ఈ బృందాన్ని అభినందించిన జిఎం పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.

అనంతరం నిర్మాణంలో ఉన్న స్టేషన్ నూతన భవనాన్ని ఆయన పరిశీలించారు. కోచ్ నిర్వహణ సౌకర్యాలు, ఇతర మౌళిక సదుపాయాల పనుల పురోగతిని జిఎం అరుణ్ కుమార్ జైన్ అడిగి తెలుసుకున్నారు. ఈ స్టేషన్‌లో మొదటి , రెండో దశ కింద చేపట్టిన పనులు జరుగుతున్నాయని, దీని కోసం ఇప్పటికే టెండరు పిలిచామన్నారు. ఈ స్టేషన్ పనులు ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో పాటు ఎంఎంటిఎస్ స్టేషన్ రెండవ దశ ప్రాజెక్ట్‌లో భాగంగా అనేక సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయని దీంతో జంట నగరాల రైల్వే స్టేషన్లకు మహర్ధశ రానుందన్నారు.

ప్రస్తుత ఏడాది బడ్జెట్‌లో చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ అభివృద్ధికి కేంద్రం రూ.82 కోట్లు కేటాయించిందని, చర్లపల్లి వద్ద పిట్ లైన్ల కోసం ‘ఆల్ వెదర్ కవర్ షెడ్ ’ నిర్మించాలని ప్రతిపాదించామని, మంజూరు కోసం రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు కూడా పంపడం జరిగిందని జిఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. చర్లపల్లిలో ప్రస్తుతం ఉన్న ఐలాండ్ ప్లాట్‌ఫారమ్‌ను విస్తరించడం, ఎంఎంటిఎస్ రైళ్ల కోసం కొత్త ప్లాట్‌ఫారమ్‌తో పాటు..ఆ కొత్త ప్లాట్‌ఫారమ్‌లపై 2 కవర్ ఓవర్ ప్లాట్‌ఫారమ్‌లు ( సిఓపి), ఇప్పటికే ఉన్న ప్లాట్‌ఫారమ్‌పై 1 సిఓపితో సహా పురోగతిలో ఉన్న అనేక పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కొత్త హై-లెవల్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, కొత్త ప్లాట్‌ఫారమ్‌లు ఐలాండ్ ప్లాట్‌ఫారమ్‌లలో వాటర్ పీడెస్టల్స్, కొత్త ఐలాండ్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ను పొడిగిస్తు, కొత్త ప్లాట్‌ఫారమ్‌లు ఐలాండ్ ప్లాట్‌ఫారమ్‌లలో వాటర్ పీడెస్టల్స్, కొత్త మరియు ఐలాండ్ ప్లాట్‌ఫారమ్‌లపై లైటింగ్ ఏర్పాట్లు చేయనున్నట్లు జిఎం అరుణ్ కుమార్ జైన్ తెలియజేశారు.

Charlapally 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News