Monday, December 23, 2024

భారీ పాన్ ఇండియా మూవీ..

- Advertisement -
- Advertisement -

ఈగ, బాహుబలి వంటి స్ట్రెయిట్ తెలుగు చిత్రాలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్. కిచ్చా సుదీప్ రీసెంట్ పాన్ ఇండియా మూవీ విక్రాంత్ రోణ తెలుగులోనూ మంచి విజయాన్ని సాధించింది. శనివారం కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన మరో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్ చంద్రూ ఈ సినిమాను రూపొందించబోతున్నారు.

బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాల కథా రచయిత వి.విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు స్క్రిప్ట్ సూపర్ విజన్ చేస్తుండటం విశేషం. కన్నడలో పలు సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన ఆర్‌సీ స్టూడియోస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News